కరోనా ఫుడ్... ఏం తినాలి, ఏం తినకూడదు

శాఖాహారం - తినవలసినవి:

- బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్, చిరుధాన్యాలు వంటివి తినండి
- బీన్స్, చిక్కుడు, పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పొందగలరు.
- ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్, వంకాయ వంటి వాటిని చేర్చండి
- రోజులో కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని తాగండి
- పుల్లని నిమ్మ పండు, బత్తాయి తీసుకోండి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే సి విటమిన్ ఉంటుంది. తద్వారా కరోనా సోకే అవకాశాన్ని తగ్గిస్తుంది
- ఆహారంలో అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి వాటిని చేర్చండి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
- ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. కొవ్వు పదార్థాలు, నూనెలను తక్కువగా తినండి.
- పండ్లను, కూరగాయలను తినడానికి ముందు శుభ్రంగా కడగండి
- వెన్న తీసిన పాలు, పెరుగును తీసుకోండి. వీటిలో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

తినకూడనివి :
- మైదా, వేపుళ్ళు, జంక్ ఫుడ్ (చిప్స్, కుక్కీస్) తినకండి.
- శీతల పానీయాలు, ప్యాక్ట్ జ్యూస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకండి - వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
- చీజ్, కొబ్బరి, పామాయిల్, బటర్ తినకండి. వీటిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు పదార్థాలు ఉంటాయి.

మాంసాహారం - తినవలసినవి:
- మాంసాహారాన్ని తాజా పదార్ధాలతో పాటు నిల్వ ఉంచకండి.
- స్కిన్ చికెన్, చేపలు, గుడ్డులో తెల్లసొన వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోండి.

తినకూడనివి :
- మాంసం, లివర్, వేపిన మాంసాన్ని తినకండి.
- వారంలో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే మాంసాహారాన్ని తీసుకోండి.
- పూర్తి గుడ్డును (పచ్చసొనతో కలిపి) వారంలో ఒక్కసారి మాత్రమే తీసుకోండి.

పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా కోవిడ్-19 నుంచి త్వరగా కోలుకోవచ్చు.

☀ రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెంచే ఆహారాన్ని తీసుకోండి.
☀ మీరు తీసుకొనే ఆహారంలో విటమిన్-C, జింక్ ఉండేలా చూసుకోండి. కోవిడ్‌తో బాధపడుతున్నవారు ఇవి తప్పకుండా తీసుకోవాలి.
☀ నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా మంచి పోషకాలు కూడా ఉంటాయి.
☀ రాగి లేదా ఓట్స్‌లో ఫైబర్, విటమిన్-B, సంక్లిష్ట పిండి పదార్థాలు ఉంటాయి.
☀ రోజూ క్రమం తప్పకుండా గుడ్డు తినండి.
☀ కరోనా వల్ల జ్వరంతో బాధపడుతుంటే కిచిడీ తినండి.
☀ కిచిడీలో ఉండే పప్పులు, అన్నం, కూరగాయలు మీకు బలాన్ని అందిస్తాయి. పైగా ఇది సులభంగా జీర్ణమవుతుంది.
☀ నీళ్లు ఎక్కువగా తాగండి. హైడ్రేషన్ ఎలాంటి అనారోగ్యం నుంచైనా త్వరగా కోలుకోడానికి ఉపయోగపడుతుంది.

Source: https://telugu.samayam.com/lifestyle/health/covid-19-food-diet-tips-for-corona-virus-recovery/articleshow/82346820.cms

https://telugu.news18.com/news/coronavirus-latest-news/corona-update-what-we-eat-and-what-not-andhra-pradesh-government-issue-food-list-for-people-in-covid-19-days-nk-541140.html

No comments:

Post a Comment