గ్రీన్‌టీతో గుడ్ హెల్త్

గ్రీన్‌టీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని, కేశసౌందర్యాన్ని పెంపొందిస్తుంది. యాంటీ అక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా కలిగి ఉండే గ్రీన్‌టీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందజేస్తుందని అంటున్నారు నిపుణులు.
- బరువు తగ్గడానికి గ్రీన్‌టీ బాగా ఉపకరిస్తుంది. సెలబ్రిటీలు, సినిమా స్టార్‌లు రోజూ గ్రీన్‌టీ తీసుకోవడానికి కారణం స్లిమ్‌గా ఉంచుతుందనే. కొవ్వు కరిగేలా చేయడంలో గ్రీన్‌టీ బాగా ఉపయోగపడుతుంది.
- శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు పంపేలా చేయడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. డైయూరిటిక్‌గా పనిచేస్తుంది.
- నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. గ్రీన్‌టీలో ఉన్న సహజ గుణాలు దంతాలపై మరకలు ఏర్పడటాన్ని నిరోధిస్తాయి.
- పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కప్పు గ్రీన్‌టీ తీసుకుంటే మంచి రిలీఫ్ లభిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది.
- ఒక కప్పు వేడిగా ఉన్న గ్రీన్ టీ తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ రెండు పూటల తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
- గ్రీన్‌టీలో కెట్‌చిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని నివారించడానికి బాగా తోడ్పడతాయి. టాక్సిన్స్, ఇతర అనేక కారణాల వల్ల చర్మంపై ఫ్రీరాడికల్స్ పేరుకుపోతాయి. ఎండలో ఎక్కువ తిరగడం వల్ల కూడా చర్మకణాలలో ఫ్రీరాడికల్స్ ఏర్పడతాయి. దీనివల్ల చర్మం నిగారింపు కోల్పోయి, వయసుపైబడిన మాదిరిగా కనిపిస్తుంది. అయితే రోజూ గ్రీన్‌టీ తీసుకోవడం ద్వారా ఎండ మూలంగా చర్మానికి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు.
- కళ్ల కింద వచ్చే చారలను తొలగించడానికి కూడా గ్రీన్‌టీ బాగా ఉపయోగపడుతుంది.
- శిరోజాలు పట్టులాంటి మృదుత్వాన్ని సంతరించుకోవా లంటే గ్రీన్‌టీ బ్యాగులను వేడి నీళ్లలో పదిహేను నిమి షాల పాటు వేసి ఉంచాలి. చల్లారిన తరువాత లేక మరుసటి రోజు ఆ నీటితో జుట్టును బాగా కడగాలి. ఏ షాంపూతో సొంతం కాదని మృదువైన శిరోజాలు మీ సొంతమవుతాయి.

No comments:

Post a Comment