మైగ్రేన్, సైనసైటిస్‌లకు శాశ్వత పరిష్కారం

సైనసైటిస్, మైగ్రేన్... సమస్య ఏదైనా భరించలేని తలనొప్పి. ఏ పనీ చేసుకోలేకపోతారు. తలనొప్పి మాత్రలు వేసినా ఫలితం శూన్యం. నిజానికి ఈ సమస్యలకు హోమియో వైద్యవిధానంలో మాత్రమే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియక, తెలిసినా నిర్లక్ష్యం చేత తలనొప్పితో బాధపడుతూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ ఒక్కసారి హోమియో చికిత్స తీసుకుంటే ఈ సమస్యల నుంచి వారికి శాశ్వత విముక్తి లభిస్తుందని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.
వైరల్, బాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా సైనస్‌లలో విపరీతమైన నొప్పి పుడితే దాన్ని సైనసైటిస్ అంటారు. ముక్కు, కళ్ల చుట్టూ ఉండే గదులను సైనస్‌లు అంటారు. మనం శ్వాస పీల్చినపుడు గాలి ముక్కు నుంచి సైనస్‌లలోకి వెళుతుంది. పీల్చే గాలిని సమశీతోష్ణస్థితికి తెచ్చే బాధ్యతను ఇవి నిర్వర్తిస్తాయి.
ప్రధాన కారణాలు
సైనస్ గదులలో మ్యూకస్ పేరుకుపోయినపుడు బాక్టీరియా, ఇతర క్రిములు పెరగడం, శ్వాసకోశ మార్గానికి ఇన్‌ఫెక్షన్ రావటం వల్ల సైనస్‌లకు బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఫలితంగా తీవ్రమైన సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. చాలాకాలం పాటు ఈ సమస్యకు పరిష్కారం కాకుండా ఉండిపోతుంది. దీన్ని క్రానిక్ సైనసైటిస్ అంటారు.
వ్యాధిని గుర్తించ డమెలా?
తరచు జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తరువాత దశలో జలుబు చేసినపుడు ముక్కులు బిగదీసుకుపోతాయి. తల అంతా బరువుగా ఉంటుంది. ఆ పైన ముక్కు నుంచి పసుపు పచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావడం మొదలవుతుంది. తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉంటుంది.
పరీక్షలు
కొన్ని పరీక్షలు చేయడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. సాధారణ ఎక్స్‌రేల వల్ల ఫలితం ఉండదు. ఫైబర్ ఆప్టిక్ స్కోప్ ద్వారా వ్యాధి నిర్ధారణ సులువవుతుంది. కొన్ని సందర్భాల్లో సి.టి స్కాన్ చేయాల్సి వస్తుంది. ఎం.ఆర్.ఐ చేయించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. వీటితో పాటు అలర్జీ టెస్ట్, రక్తపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
హోమియో చికిత్స
సైనస్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపేది హోమియో చికిత్స మాత్రమే. ఈ చికిత్సతో సర్జరీ అవసరం లేకుండానే సైనసైటిస్‌ను సమూలంగా తగ్గించుకోవచ్చు. పైగా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇతర చికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు.
మైగ్రేన్
మైగ్రేన్ అంటే పార్శ్వ తలనొప్పి. దీనిప్రభావం తలలో ఏదైనా ఒకవైపు ఉంటుంది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. న్యూరలాజికల్ డిజార్డర్. నొప్పి తలకు ఒకవైపు మొదలవుతుంది. నరాలు కొట్టుకుంటూ ఉండటం, వికారం, వాంతులు కావడం, చిన్న చిన్న శబ్ధాలను, వెలుతురును భరించలేకపోతారు. మైగ్రేన్ తలనొప్పి ప్రారంభమయ్యే సమయంలో వస్తువులు మసకగా కనిపించడం గానీ, మోటార్ డిస్టర్‌బెన్స్ గానీ చూస్తుంటాం.
ఎవరికి వస్తుంది?
పురుషుల్లో కన్నా స్త్రీలలో 3 శాతం ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలో మైగ్రేన్ ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి ఉన్నా వంశపారంపర్యంగా పిల్లలకు వచ్చే అవకాశం యాభైశాతం ఉంటుంది.
ఎన్ని దశలుంటాయి?
సాధారణంగా నాలుగు దశలు ఉంటాయి. అయితే ప్రతీ ఒక్కరిలో నాలుగు దశలు ఉండకపోవచ్చు. కొంతమందిలో రెండు దశలు కూడా ఉండవచ్చు.
PRODROME : 40 నుంచి 60 శాతం మందిలో ఉంటుంది. మెడ కండరాలు గట్టి పడటం, కళ్లు తిరగడం వంటి లక్షణాలన్నీ మైగ్రేన్ తలనొప్పికి వచ్చే ఒక్కరోజు ముందుగానీ కొన్ని గంటల ముందు గానీ బయటడతాయి.
AURA : ఇది మైగ్రేన్ తలనొప్పి వచ్చే 20 నుంచి 30 నిమిషాల ముందు వస్తుంది. కంటికి నల్లని, తెల్లని మచ్చలు కనిపించడం, జిగ్‌జాగ్ లైన్స్ ఏర్పడటం వంటి లక్షణాలు ఉంటాయి.
PAIN : నొప్పి తలకు ఒకవైపు మొదలయి రెండు వైపులా విస్తరిస్తుంది. నొప్పి 48 గంటల నుంచి 72 గంటలపాటు ఉంటుంది. వారానికి ఒకసారిగానీ, నెలకొకసారి గానీ ఈ మైగ్రేన్ నొప్పి వస్తుంటుంది. కొందరిలో రోజూ రావడం గమనిస్తాం.
 మైగ్రేన్ నొప్పి తగ్గినా దాని ప్రభావం కొన్ని రోజులు ఉంటుంది. తల పుండుగా ఉండటం, నీరసం, తల బరువుగా ఉండటం వంటి లక్షణాలుంటాయి.
హోమియో చికిత్స
వ్యాధి తీవ్రత, మూలకారణాలను తెలుసుకుని చికిత్స అందించడం హోమియో వైద్యవిధానం ప్రత్యేకత. అందుకే హోమియో చికిత్సతో మైగ్రేన్ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే మైగ్రేన్ నుంచి విముక్తి లభిస్తుంది. కింది ఔషధాలు మైగ్రేన్ చికిత్సలో బాగా ఉపయోగపడతాయి.
GLONINE: ఎంతకీ తగ్గని మైగ్రేన్ తలనొప్పి సైతం ఈ మందుతో పూర్తిగా నయమవుతుంది.
బెల్లడోనా: మైగ్రేన్ తలనొప్పికి ఇది మంచి మందు. చిన్న చిన్న శబ్ధాలకు, వెలుతురుకు తలనొప్పి వస్తున్నా, పడుకున్నప్పుడు నొప్పి ఉన్నా వాడదగిన ఔషధం.

No comments:

Post a Comment